Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని కాదు బీజేపీ విధానాన్ని ఓడించాలి : యశ్వంత్ సిన్హా

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (13:39 IST)
కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల నేతలు ఏకమయ్యారు. ఇందులో మోడీ వ్యతిరేకులుగా ముద్రపడిన బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా ఉన్నారు. 
 
ఇందులో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ, ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఒక్క‌ర్నే వ్య‌తిరేకించేందుకు ఈ స‌భ‌ను ఏర్పాటు చేయ‌లేద‌ని, మొత్తం బీజేపీ విధానాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అనుస‌రిస్తున్న ఐడియాల‌జీకి తాము వ్య‌తిరేక‌మ‌న్నారు. 
 
గ‌త 56 నెల‌లుగా భార‌త ప్ర‌జాస్వామ్యం తీవ్ర ప్ర‌భావానికి లోనైంద‌న్నారు. మోడీ వికాశాన్ని తేలేద‌ని, నాశ‌నం తీసుకువ‌చ్చార‌న్నారు. త‌న‌కు కోరిక‌లు ఏమీ లేవ‌ని, కేవ‌లం బీజేపీ ప్ర‌భుత్వాన్ని నేల‌కూల్చ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. 
 
'స‌బ్‌కా సాత్ స‌బ్ కా వికాస్' అన్నారు, కానీ ఆ నినాదంలో వికాశం లేద‌ని, కేవ‌లం వినాశ‌న‌మే ఉంద‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా దెబ్బ‌తింద‌న్నారు. గ‌ణాంకాల‌తో ఈ ప్ర‌భుత్వం ఆట‌లాడుతోంద‌న్నారు. 
 
ఆ తర్వాత లోక్‌తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశంలో తీవ్రమైన సంక్షోభం ఉందన్నారు. రైతులు తీవ్రమైన నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 7 కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని గుర్తుచేశారు.
 
దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను బీజేపీ తన గుప్పిట పట్టుకుందనీ, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గంగలో నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు. మరో రాజకీయ విప్లవానికి కోల్‌కతా నాంది పలికిందన్నారు. బీజేపీ అవినీతికి రాఫెల్ కుంభకోణం ఒక నిదర్శనం అని శరద్ యాదవ్ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments