Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాస ద్వీపంలోకి భారతీయుల రాకపై నిషేధం.. నిత్యానంద

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (19:42 IST)
వివాదస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలో ఆశ్రమం నిర్వహించే నిత్యానందపై మహిళా భక్తుల నుంచి లైంగిక దాడి, లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశం నుంచి పారిపోయిన ఆయన 2019 నుంచి ఈక్వెడార్ తీరంలో ఉన్న ద్వీపంలో దాగి ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కైలాస దేశంగా పేరు పెట్టడంతో పాటు ప్రత్యేక చట్టాలను రూపొందించారు. కైలాసను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి కూడా విజ్ఞప్తి చేశారు.
 
తాజాగా తన దేశంగా ప్రకటించుకున్న కైలాస ద్వీపంలోకి భారతీయుల రాకపై నిషేధం విధించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్రెజిల్‌, ఐరోపా యూనియన్‌, మలేషియాతోపాటు భారత్ నుంచి భక్తులు, పర్యాటకుల రాకపై తదుపరి ఆదేశాల వరకు నిషేధం విధించినట్లు తెలిపారు. కైలాస రాష్ట్రపతి ఆదేశం పేరుతో ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం