Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో పెరుగుతున్న కరోనా స్ట్రెయిన్ కేసులు : కేంద్ర తాజా గైడ్‌లైన్స్

Advertiesment
Corona Strain Virus
దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ కరోనా వైరస్‌తో పోల్చితే ఈ కేసులు మరింతా పెరుగుతున్నాయి. దీనికి కారణం సౌతాఫ్రికా, బ్రెజిల్ కొవిడ్ స్ట్రెయిన్స్‌ కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. 
 
దీంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రయాణికులకు, ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులకు తాజా మార్గదర్శకాలను ప్రభుత్వం విధించింది. యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
 
ప్రస్తుతం ఇండియాలో సౌతాఫ్రికా స్ట్రెయిన్ నలుగురిలో, బ్రెజిల్ స్ట్రెయిన్ ఒకరిలో బయటపడిన విషయం తెల్సిందే. దీంతో యూకే స్ట్రెయిన్ కేసులు 187కు చేరాయి. ఇక కొత్త ట్రావెల్ గైడ్ లైన్స్ ప్రకారం, విమాన ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే విమానం ఎక్కేందుకు అనుమతినిస్తారు. 
 
ఈ పరీక్ష చేయించుకునేందుకు అవసరమైన ఖర్చును ప్రయాణికులే భరించాల్సి వుంటుంది. ఇక, కుటుంబంలో ఎవరైనా మరణించడం వల్ల విదేశాలకు వెళ్లవలసి వస్తే కనుక వారికి మినహాయింపు ఉంటుంది. ఇక ఎవరికైనా వైరస్ సోకితే, వారి కోసం ప్రత్యేక ప్రొటోకాల్‌ను పాటించాల్సి వుంటుంది. 
 
ఇదిలావుండగా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్లు యూకే వేరియంట్‌పై పని చేస్తున్నాయని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లపై ఇవి ఎలా పనిచేస్తాయన్న విషయమై ప్రయోగాలు సాగుతున్నాయని తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగ్గుమన్న ధరలు.. పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు