Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ ప్యాకెట్స్‌ని రుచి చూసిన జొమోటో డెలివరీ బాయ్.. నమ్రత ఫైర్

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:10 IST)
హోటల్స్‌, రెస్టారెంట్లలో నాణ్యత కలిగిన ఆహార పదార్థాలను సర్వ్ చేస్తున్నారో ఏమో. ఆ విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు బుక్ చేసేలా.. ఆహార పదార్థాలను బుక్ చేయడం ఫ్యాషనైపోయింది. ఆహార పదార్థాలను యాప్‌ల ద్వారా ఇంటికి తెచ్చుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇలా ఆహార పదార్థాలను డోర్ డెలివరీ చేసే సంస్థలు పెచ్చరిల్లిపోతున్నాయి. 
 
అలాంటి వాటిలో జొమాటో సంస్థ కూడా ఒకటి. కానీ జొమాటో డెలివెరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్‌ని ఓపెన్ చేసి కొంచెం కొంచెం తిని.. తిరిగి ప్యాక్ చేసి డెలివరీ చేశాడు. ఇలా మూడు నాలుగు ఫుడ్ ప్యాకెట్లను రుచి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో రెండు రోజుల పాటు నెట్టింట చక్కర్లు కొట్టింది. దీన్ని చూసిన నెటిజన్లు సదరు ఫుడ్ డెలివరీ సంస్థపై విరుచుకుపడుతున్నారు. 
 
తాజాగా జొమాటో డెలివరీ బాయ్‌పై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి కూడా మండిపడింది. ఈ వీడియో చూసి తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయింది. అంతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసి చెడామడా తిట్టేసింది. మంచి పేరున్న పుడ్ డెలివరీ సంస్థ పనితీరు ఇలా వుంటుందా అని షాక్ అయ్యింది.
 
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు. కానీ ఇలాంటి పనులా చేసేది.. వర్క్ ఎథిక్స్ అనేవి లేవా.. ఇదంతా చూస్తుంటే.. ఫుడ్ ఆర్డర్ చేయాలంటే, ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుందని.. ఇంకా తన పిల్లలను మాత్రం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను.. అందరూ ఇదే చేస్తే మంచిదని నమ్రత ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments