హీరో మహేష్ భార్యపై మలైకా అరోరా అనుచిత వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహించే 'వోగ్ బీఎఫ్ఎఫ్' కార్యక్రమానికి తాజాగా మలైకా హాజరైంది.
టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహించే 'వోగ్ బీఎఫ్ఎఫ్' కార్యక్రమానికి తాజాగా మలైకా హాజరైంది. ఆ సందర్భంగా మోడలింగ్‌లో ఎదురైన అనుభవాల గురించి చెప్పమని మలైకాను నేహా అడిగింది.
దీనిపై మలైకా స్పందిస్తూ, 'నమ్రతా శిరోద్కర్, మోహర్ జెస్సియా మోడలింగ్ రంగంలో నాకు సీనియర్లు. అప్పటికే వారు టాప్ మోడల్స్‌గా ఉన్నారు. దాంతో వారు జూనియర్‌నైన నాతో దురుసుగా ప్రవర్తించేవారు. అయితే ఇప్పుడు వారిద్దరితో నేను స్నేహం కొనసాగిస్తున్నాన'ని మలైకా తెలిపింది.
కాగా, బాలీవుడ్‌లోకి రాకముందు మలైకా మోడలింగ్ రంగంలో రాణించింది. అప్పటికే నమ్రతా శిరోద్కర్ టాప్ మోడల్. నమ్రతతోపాటు మరో మోడల్ మెహర్ జెస్సియా కూడా తమ సీనియారిటీ కారణంగా తనతో పొగరుగా ప్రవర్తించేవారని మలైకా తాజాగా ఆరోపిస్తోంది.