Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొంచివున్న పెనుముప్పు... ముంబై మునిగిపోతుందా? క్లైమేట్ సెంట్రల్ ఏమంటోంది?

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (12:06 IST)
ముంబై మహానగరానికి పెను ముప్పు పొంచివుంది. ఫలితంగా ముంబై నగరం మునిగిపోతుందా అనే సందేహం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమాని ప్రపంచ వ్యాప్తంగా మంచుకరిగిపోతోంది. దీంతో సముద్రమట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా 2050 నాటికి పాత అంచనాల కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రజలు ప్రభావితమవబోతున్నారు. మన దేశం విషయానికి వస్తే ఆర్థిక రాజధాని ముంబైకి పెను ప్రమాదం పొంచి ఉంది. 
 
ఈ వివరాలను అమెరిలోని న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తున్న 'క్లైమేట్ సెంట్రల్' అనే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ చేసిన అధ్యయనానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్... నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది. ఈ అధ్యయనం మేరకు ప్రస్తుతం 15 కోట్ల మంది నివసిస్తున్న భూభాగం... ఈ శతాబ్దం మధ్య కాలం (2050) నాటికి సముద్ర తీరాన్న తాకే ఎత్తైన అలల కంటే తక్కువ ఎత్తులో ఉండబోతోంది. అంటే... ఈ ప్రాంతాలను సముద్రం ఆక్రమించుకోబోతోంది. ఇదేసమయంలో ముంబైకి పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా చరిత్రాత్మకమైన డౌన్‌టౌన్ తీవ్రంగా ప్రభావితం కానుంది. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.
 
ఇదే అంశంపై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే సంస్థకు చెందిన డీనీ లోనెస్కో మాట్లాడుతూ, అన్ని దేశాలు ఇప్పటి నుంచే ముందు చూపుతో చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపుకు గురికాబోతున్న ప్రాంతాల్లోని ప్రజలకు ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ఇప్పటి నుంచే చేపట్టాలని చెప్పారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని... విపత్తు ముంచుకొస్తోందనే విషయం మనందరికీ తెలుసని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments