ఆస్పత్రిలో చేరిన బిగ్ బి... కారణం కాలేయ సమస్యేనట..

శుక్రవారం, 18 అక్టోబరు 2019 (11:19 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ అలియాభట్ రణబీర్ సింగ్‌లతో కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు బిగ్ బి 'జుంద్', 'చెహ్రీ', 'గులాబో సీతాబో' సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అమితాబ్ ఫుల్ బాడీ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరారని.. ఆయన బాగానే వున్నారని ముంబై నగరంలోని నానావతి ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. 
 
అమితాబ్‌ను విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. బిగ్ బి కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చి ఆయన్ను పరామర్శించారు. తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో వెల్లడించిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చేరడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను టీబీ, హెపటైటిస్ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని కూడా బిగ్ బి ఇటీవల వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ''టార్చ్‌లైట్'' ట్రైలర్.. సదా అందాలు.. జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా? (Trailer)