దసరా సెలవులు పొడిగింపు.. అంతా ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్

ఆదివారం, 13 అక్టోబరు 2019 (16:27 IST)
దసరా సెలవులను పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14న సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది.

అయితే, ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసే క్రమంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. దీంతో సర్కారు కూడా దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దసరా సెలవులు అక్టోబర్ 19 (శనివారం) వరకు పొడిగించారు. ఇక ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 21 నుంచి అంటే సోమనారం నాడు మళ్లీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 
 
కాగా తెలంగాణలో ఆర్టీసిని విలీనం చేయాలంటూ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం.. సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టేనని ప్రకటించింది.

ఈ క్రమంలో కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. కార్మికులు కూడా తమ డిమాండ్లను సాధించే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చేశాయి. ఈ క్రమంలో వారం రోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. దీంతో దసరా సెలవులను పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కుందనపు బొమ్మలా శోభనం గదికి వెళ్తే.. భర్త స్థానంలో మరిది.. చివరికి?