కళ్ళలో కారంచల్లి భర్తను హత్య చేసిన భార్య... ఎందుకో తెలుసా?

శనివారం, 12 అక్టోబరు 2019 (11:12 IST)
మద్యం సేవించి వచ్చి నిత్యం వేధిస్తూ వచ్చిన భర్తను ఓ భార్య హత్య చేసింది. కళ్లలో కారంచల్లి నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గోదావరిఖని పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రయ్య-సుగుణమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరిలో చంద్రయ్య సింగరేణి కాలరీస్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. పూర్తిగా మద్యానికి బానిసైన చంద్రయ్య భార్యను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో శుక్రవారం కూడా ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుగుణమ్మ భర్త కళ్లలో కారం కొట్టి కత్తితో దాడిచేసింది. మెడ, కాళ్లు, చేతులపై విచక్షణ రహితంగా కత్తితో పొడిచింది. తీవ్ర గాయాలపాలైన చంద్రయ్య తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
భర్త మృతి చెందిన విషయాన్ని నిర్ధారించుకున్న సుగుణమ్మ అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది వివరించి పోలీసులకు లొంగిపోయింది. అయితే, సుగుణమ్మ అబద్దాలు చెబుతోందని, హత్యకు మద్యం తాగడం కారణం కాదని, ఇంకేదో ఉంటుందని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అమ్మోరు ఆలయంలో తాళికట్టాడు.. రాత్రి శోభనం చేశాడు... ఉదయానికి పరార్