Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపింజరి కాటుకు చావలేదనీ... నాగుపాముతో భార్యను చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 25 మే 2020 (16:49 IST)
ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్య చంపేశాడు. అదీకూడా పక్కా పాము స్కెచ్‌తో. తన ప్రణాళికలో భాగంగా తొలుత రక్తపింజరి పాముతో చంపాలని ప్రయత్నించాడు. కానీ, ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ దఫా నాగుపాముతో తన స్కెచ్‌ను పక్కాగా అమలు చేశాడు. ఇంతకీ భార్యను చంపడానికి గల కారణం.. అదనపు కట్నం తీసుకునిరాకపోవడమే. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొల్లా జిల్లా అంచల్ పట్టణానికి చెందిన సూరజ్, ఉత్రా అనే దంపతులు ఉన్నారు. ఇందులో సూరజ్ ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అప్పటికీ ఆమెలో చలనం లేదు. ఎంతో ఒత్తిడి తెచ్చినా ఫలితం లేదు. దీంతో భార్యను తెలివిగా చంపేయాలని ప్లాన్ వేసుకున్నాడు. 
 
తన ప్లాన్‌లో భాగంగా గత మార్చి నెలలో ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు చెల్లించి రక్తపింజరి పామును కొనుగోలు చేసి, దాన్ని ఎవరికీ తెలియకుండా బెడ్రూమ్‌లో వదిలాడు. ఆ పామును చూసి హడలిపోయిన ఉత్రా దాన్నుంచి తప్పించుకునే క్రమంలో కాటుకు గురైంది. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొంది క్షేమంగా బయటపడింది. 
 
అయితే, ఈసారి సూరజ్ నాగుపామును తెప్పించాడు. పుట్టింట్లో ఉన్న ఉత్రా నిద్రపోతున్న గదిలో ఆ విషసర్పాన్ని వదిలాడు. ఆ పాము ఉత్రాను కాటేయడంతో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి అదృష్టం ముఖం చాటేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఉత్రా ప్రాణాలు విడిచింది.
 
తన కుమార్తెను రెండు సార్లు పాము కరవడంపై అనుమానం వచ్చిన ఉత్రా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్త సూరజ్‌ను, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అతడి తెలివికి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారట! కొసమెరుపు ఏంటంటే.. పెళ్లి సమయంలో 98 కాసుల బంగారంతో పాటు.. లక్షలాది రూపాయలను వరకట్నంగా సూరజ్ తీసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments