Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడగగానే అన్నీ విప్పి చూపించొద్దు .. స్నేహాలపై ఆన్​లైన్​ స్నేహాలపై సీబీఎస్​ఈ

Webdunia
సోమవారం, 25 మే 2020 (16:25 IST)
కరోనా లాక్డౌన్ వేళ ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ వినియోగం, కార్యకలాపాలపై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా, ఈ విషయంలో యువత ముందంజలో ఉంది. అయితే, ఈ ఆన్‌లైన్ వినియోగంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే ముప్పూ ఉంది. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. 
 
ఈ సందర్భంగా వర్చువల్​ ప్రపంచంలో యువత తమ భద్రత కోసం సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (సీబీఎస్​ఈ) హ్యాండ్​ బుక్​ విడుదల చేసింది. ద్వేషపూరిత అశ్లీలత, ఆన్​లైన్​ స్నేహాల్లో పరిమితులు విధించుకోవటం, ఆన్​లైన్​లో ఏదైనా సమస్య ఎదుర్కొంటే పెద్దలకు తెలపటం వంటివి ముఖ్యమైన అంశాలుగా అందులో పేర్కొన్నారు. 
 
లాక్డౌన్​తో బోధనా కార్యక్రమాలు పూర్తిగా ఆన్​లైన్​లోకి వెళ్తోన్న క్రమంలో.. విద్యార్థులు డిజిటల్​ ప్రపంచానికి చేరువవుతున్నారు. ఇటీవల బయటపడిన 'బోయిస్​ లాకర్​ రూమ్'​ గ్రూప్​ కేసు వల్ల ఆన్​లైన్​ బెదిరింపుల ఆందోళనలూ పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆన్​లైన్​ ప్రపంచంలో యువత తమ భద్రతను నిర్ధరించుకోవటానికి పలు మార్గదర్శకాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. 
 
ద్వేషపూరిత అశ్లీలత (రివేంజ్​ పోర్నోగ్రఫీ), ఆన్​లైన్​ స్నేహాల్లో పరిమితులు విధించుకోవటం, స్నేహితులను అంచనా వేయటం, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు పెద్దలకు తెలపటం వంటివి సీబీఎస్​ఈ విడుదల చేసిన పాఠాల్లోని ముఖ్యమైన అంశాలు. 9-12వ తరగతుల విద్యార్థుల కోసం సైబర్​ భద్రత హ్యాండ్​బుక్​ను విడుదల చేసింది సీబీఎస్​ఈ. ఇందులో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు సైబర్​ నేరాల విషయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనేది ప్రస్తావించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments