బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై కేసు నమోదైంది. భారత సైనికులు ధరించే దుస్తుల(యూనిఫాం)ను అసభ్యకర రీతిలో చూపించండంతో ఆమెపై ఈ కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన విశాల్ కుమార్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలాజీ టెలీఫిలింస్ నిర్మించిన ఓ వెబ్‌సిరీస్‌లో ఇండియన్ ఆర్మీ డ్రెస్‌ను అభ్యంతరకర రీతిలో చూపించారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు విశాల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్మీ యూనిఫాంను అపహాస్యం చేశారన్నారు.
ఫేస్‌బుక్ పేజీలో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారన్నారు. ఓ ఆర్మీ అధికారి భార్య, వేరే వ్యక్తికి మధ్యనున్న సంబంధాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. పూర్తి వివరాలను పరిశీలించి ఏక్తాకపూర్‌కు నోటీసులు పంపుతామని వెల్లడించారు.
గతంలో కూడా ఏక్తా కపూర్ పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. సంచలం కోసం లేదా తాము నిర్మించే సినిమాలు, టెలీ సీరీస్‌లు, వెబ్ సిరీస్‌లు సంచలనం కోసం ఈ తరహా వివాదాలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆజ్యం పోస్తూవుంటారు. ఆ కోవలోనే ఇపుడు ఏక్తా కపూర్ వివాదం కూడా చేరినట్టు తెలుస్తోంది.