Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్‌టాక్‌తో వల విసిరి.. ప్రేమ పేరుతో మోసగించి.. అత్యాచారం

Advertiesment
Hyderabad
ఇటీవలికాలంలో పలువురు యువతులు సోషల్ మీడియా పుణ్యమాని మోసపోతున్నారు. ముఖ్యంగా, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి వాటిలో చాటింగ్ చేస్తూ అవతలి వ్యక్తుల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఓ యువతి టిక్‌టాక్‌ మాయలో పడి ఓ వ్యక్తి చేతిలో మోసపోవడమేకాదు ఏకంగా అత్యాచారానికి గురైంది. చివరకు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకుని పత్తాలేకుండా పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన యువతి (27)కి గతేడాది డిసెంబరులో తలాబ్‌కట్ట నషేమన్‌ నగర్‌‌కు చెందిన అక్బర్ షా (34) అనే వ్యక్తి టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరి మధ్య కొద్దిరోజుల పాటు చాటింగ్ జరిగింది. ఆ తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటూ అక్బర్ షా ఆ యువతికి వల వేశాడు. అంతే.. అక్బర్ షా వలలో ఆ యువతి పడిపోయింది. 
 
అయితే, నిజానికి అక్బర్ షాకు అప్పటికే వివాహమై నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, యువతి వద్ద తమ పెళ్లి విషయం దాచిపెట్టాడు. ఆ తర్వాత యువతిని టోలీచౌకిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పెళ్లి చేసుకుంటానని ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. అదీకూడా బంధువుల సమక్షంలో. ఆపై మరోమారు అత్యాచారానికి పాల్పడి, అక్కడ నుంచి పత్తాలేకుండా పారిపోయాడు. 
 
అప్పటికిగాని ఆ యువతికి అర్థంకాలేదు. తాను మోసపోయాననే విషయాన్ని గ్రహించిన యువతి... చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వైద్యుడు పట్ల పోలీసులు ఎంతో సౌమ్యంగా వ్యవహరించారు : విశాఖ సీపీ