వామ్మో... చిరుత లారీ క్లీనర్ కాలును కొరికింది- Video

శనివారం, 16 మే 2020 (20:41 IST)
హైదరాబాద్ శివార్లో చిరుత కలకలం సృష్టించింది. బుద్వేల్ నుంచి చిరుత తప్పించుకుంది. బుద్వేల్ రైల్వే స్టేషన్, కాటేదాన్ ఏరియాల్లో పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఆ ఏరియాల్లో చిరుత సంచరిస్తుందన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
శుక్రవారం నుంచి చిరుతను పట్టుకోవడానికి పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతను బయటకు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ... చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రాత్రంతా ఆపరేషన్ చిరుత కొనసాగింది. అయినా ప్రయోజనం లేదు.
 
అయితే.. 24 గంటలు దాటినా ఇంకా చిరుతను పట్టుకోలేకపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు ఎవరిపై చిరుత దాడి చేస్తుందో అని భయపడుతున్నారు. 
 
నిన్న ఓ షాపుపై దాడి చేసి అక్కడ నుంచి వెళ్లిపోయిన చిరుత ఈ రోజు ఆ ఏరియాలోని ఓ లారీ క్లీనర్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ క్లీనర్ లారీ క్యాబిన్‌లోకి వెళుతుంటే కాలును పట్టుకుని దాడి చేసే ప్రయత్నం చేసింది. 
 
ఆ క్లీనర్ సమయస్పూర్తితో లారీ క్యాబిన్‌ని గట్టిగా పట్టుకుని కాలుని గట్టిగా లాగి వెంటనే లోపలకి వెళ్లడంతో చిరుత నుంచి తృటలో తప్పించుకున్నాడు. ఈ విజువల్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనాతో సింగిల్‌గా వుండటం కష్టం.. లైంగిక భాగస్వామిని ఎంచుకోండి..?