Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనాతో సింగిల్‌గా వుండటం కష్టం.. లైంగిక భాగస్వామిని ఎంచుకోండి..?

కరోనాతో సింగిల్‌గా వుండటం కష్టం.. లైంగిక భాగస్వామిని ఎంచుకోండి..?
, శనివారం, 16 మే 2020 (19:38 IST)
కరోనా లాక్ డౌన్‌తో ఒంటరి జీవితం గడపటం కష్టమని.. సింగిల్‌గా వున్నవారు దాంపత్య లేదా లైంగిక భాగస్వామిని ఎంచుకోండని నెదర్లాండ్ సర్కార్ ప్రకటించింది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తరుణంలో లాక్ డౌన్‌తో రిలాక్స్ కావాలంటే శృంగారం మంచి మందు అంటూ పేర్కొంది. వివాహితుల మాట పక్కనబెడితే ఒంటరిగా జీవితం గడిపేవారు.. జీవిత భాగస్వామిలా, లైంగిక సాంగత్యం కోసం ఓ భాగస్వామిని ఎంచుకోవాలని సూచించింది. ఇంకా శృంగార ప్రియులకు డచ్ ప్రభుత్వం కొన్ని సలహాలు ఇచ్చింది.
 
ఒంటరిగా ఉన్న వాళ్లకు ఓ ఘాటైన సలహా ఇచ్చింది డచ్ సర్కార్.. రెగ్యులర్ పార్ట్నర్‌తో సెక్స్ సాధ్యమే అన్న అభిప్రాయాన్ని కూడా డచ్‌ పబ్లిక్ హెల్త్ శాఖ పేర్కొంది. ఒకవేళ భాగస్వామికి కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే, వారితో సంభోగం చేయవద్దు అని క్లారిటీ ఇచ్చేసింది. ఇక సింగిల్‌గా ఉన్నవారు ఎలా శారీరక వాంఛను తీర్చుకోవాలో చిట్కాలు కూడా చెప్పుకొచ్చింది.
 
ఒంటరిగా ఉన్నవారికి ఎవరైనా రెగ్యులర్ పార్ట్నర్ ఉంటే వారిని కలుసుకోవచ్చు అనే సలహా ఇచ్చింది. అయితే, ఒకవేళ ఎక్కువ మందిని కలిసే అలవాటు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది. భౌతిక దూరం పాటిస్తూనే తమతో తాము కానీ, ఇతరులతో కానీ సెక్స్ చేయవచ్చు అనే ఐడియాను ఇచ్చింది. 
 
ఒకవేళ మీకు భాగస్వామి ఉంటే, వారితో శృంగారపరమైన కథలు, ముచ్చట్లు చెప్పుకోవాలని.. అలా కాని పక్షంలో ఇద్దరూ హస్తప్రయోగం చేసుకోవచ్చునని కూడా సలహా ఇచ్చింది. కాగా గడిచిన 24 గంటల్లో నెదర్లాండ్‌లో 200 మందికి కరోనా వైరస్ సోకింది. ఇంకా 53మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా నెదర్లాండ్‌లో మొత్తం 43,880 కరోనా కేసులు, 5,500 మృతులు నమోదైనాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్క్ ఫ్రమ్ హోమ్‌ వారికి.. ఎయిర్‌టెల్ డబుల్‌ డేటా ప్లాన్