Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కేసీఆర్... బాబుకు బర్త్‌డే గిఫ్టు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారా...?

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (14:31 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ పర్యటనకు వచ్చారు. విశాఖపట్టణంలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠంలోని రాజశ్యామల ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 
 
శారదాపీఠం ఆవరణలో ఉన్న శమీ వృక్షానికి, విజయ హనుమాన్‌కు కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. అంతకుముందు కుటుంబసభ్యులతో కలిసి శారదాపీఠానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు. 
 
సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ సమావేశమవుతారు. సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్ కుమార్‌, రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌శాంత్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. 
 
అంత‌కుముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో విశాఖ‌లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎయిర్‌పోర్ట్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత జ‌నాల‌కు కేసీఆర్ అభివాదం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జైకేసీఆర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments