Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కేను? సర్వత్రా ఆసక్తి!

కేసీఆర్ కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కేను? సర్వత్రా ఆసక్తి!
, ఆదివారం, 16 డిశెంబరు 2018 (12:30 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. తనతో పాటు ఒక్కరిని మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన పేరు మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ. రాష్ట్ర హోంశాఖ మంత్రిత్వ శాఖను అప్పగించారు. అలాగే, మిగిలిన మంత్రులుగా ఎవరిని చేర్చుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
మంత్రివర్గ విస్తరణ కాస్త ఆలస్యమవుతుండటంతో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నెల 20వ తేదీ వరకే మంచి రోజులు ఉన్న నేపథ్యంలో అప్పటిలోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ సోమవారం బాధ్యతలు చేపడుతున్నారు. దీంతో ఆరోజు మంత్రివర్గ విస్తరణ ఉండబోదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.
 
కొత్త ఎమ్మెల్యేలలో అత్యధికులు రెండు, అంత కంటే ఎక్కువసార్లు గెలిచిన వారే ఉన్నారు. దీంతో మంత్రి పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మంత్రి పదవులను ఆశించే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలుస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలసి నేరుగా తమ మనసులోని కోరికను చెబుతున్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 119. ఆ ప్రకారంగా మంత్రివర్గం సంఖ్య కూడా 17కు మించరాదు. ఇప్పటికే ఒకరిని తీసుకున్నారు. మిగిలిన 16 మంది ఎవరన్నదానిపైనే ఇపుడు ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నలుగురు ఓడిపోయారు. వీరి స్థానంలో కొత్తవారికి చోటు కల్పించనున్నారు. సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయన మంత్రివర్గాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ కంచుకోటలో ప్రధాని మోడీ .. లోక్‌సభ ప్రచారానికి శ్రీకారం