Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావడం ఖాయం... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావడం ఖాయం... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:42 IST)
తెలంగాణా ముఖ్యమంత్రిగా 2వ సారి ప్రమాణ స్వీకారం  చేసిన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రగతి భవన్ నందు సినీ దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ "గుణాత్మకమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్న కె.సి.ఆర్‌కు ఒక తెలుగువాడిగా తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాని అన్నారు.
 
అన్నీ అనుకూలిస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కె.సి.ఆర్ ఈ దేశానికి ప్రధాని కావటం ఖాయమని అన్నారు. దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేసి ప్రజల మన్ననలు అందుకుంటున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఎన్నో నూతన పథకాలను చేపట్టి బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయలని ఆకాంక్షించారు.
webdunia
 
60 సంవత్సరాల ప్రజల కల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వీరుడుగా ఆయన ఉద్యమ స్ఫూర్తి గొప్పదని అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధనలో కేసీఆర్ మద్దతు తెలిపి ఉద్యమించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కమల్‌నాథ్‌కే.. రాజస్థాన్ ఎవరికో?