'క‌త్తి' కోసం రూ.17 ల‌క్ష‌లు సాయం ప్రకటించిన జగన్ సర్కార్

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (17:14 IST)
కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ మహేష్ చికిత్స నిమిత్తం ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.17 లక్షలు విడుదల చేసింది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌త్యేక అధికారి హ‌రికృష్ణ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. నెఫ్ట్ ద్వారా 17 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను చెన్న‌య్ అపోలో ఆసుప‌త్రికి  ట్రాన్స్ఫ‌ర్ చేశారు.
 
నెల్లూరు శివారులోని చంద్ర‌శేఖ‌ర్ పురం వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై జ‌రిగిన ప్ర‌మాదంలో క‌త్తి మ‌హేష్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఫిలిం క్రిటిక్, బిగ్ బాస్ ఫేం క‌త్తి మ‌హేష్ త‌న స్వ‌గ్రామం చిత్తూరు నుంచి హైద‌రాబాదుకు తిరిగి వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. క‌త్తి మ‌హేష్ ఇన్నోవా కారు, ఒక గూడ్స్ లారీని వెన‌క నుంచి ఢీకొంది. తీవ్రంగా గాయ‌ప‌డిన క‌త్తిని తొలుత నెల్లూరులోని ఒక ఆసుప‌త్రిలో చేర్చారు. ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌టంతో చెన్న‌య్ అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అక్క‌డ గ‌త మూడు రోజులుగా చికిత్స పొందున్న క‌త్త మ‌హేష్ ఆరోగ్యంపై ఆందోళ‌న మొద‌లైంది. ఆయ‌న చూపు దెబ్బ‌తింద‌ని, ఆరోగ్య ప‌రిస్థితి తీవ్రంగా ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇపుడు క‌త్తికి ప్రాణ హాని ఏమీలేద‌ని, ఆయ‌న కోలుకుంటున్నార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

క‌త్తికి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య నిమిత్తం స‌హాయం చేయాల‌ని ఆయ‌న బంధువులు సి.ఎం.ఆర్.ఎఫ్. కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వెను వెంట‌నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క‌త్తి వైద్య ఖ‌ర్చుల నిమిత్తం 17 ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments