Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాల‌న‌టుడిగా అవార్డు స్థాయినుంచి హీరోగా ఎదుగుతున్న విశ్వ కార్తికేయ

బాల‌న‌టుడిగా అవార్డు స్థాయినుంచి హీరోగా ఎదుగుతున్న విశ్వ కార్తికేయ
, శుక్రవారం, 2 జులై 2021 (17:00 IST)
Viswa Kartikeya
కె. రాఘవేంద్రరావు `ఈ నిజం అబద్ధం ఐతే` అనే టెలి ఫిల్మ్ లో ప్రేక్షకులనే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మెప్పించి ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు, అలాగే అవార్డు ఫర్ మెరిటోరియస్ అచివ్మెంట్ అవార్డు ని పొందాడు. ఇటు చదువులోనూ, అటు సినిమాల్లోనూ రాణిస్తూ 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా తన మార్క్ ని చూపించాడు మన విశ్వ కార్తికేయ. డాన్స్ లోనూ, ఫైట్స్ లోనూ ఈజ్ ను కనబరుస్తూ వావ్ అనిపిస్తున్నాడు. తాజాగా విశ్వ కార్తికేయ హీరోగా ఓచిత్రం రూపొందుతోంది. జూలై 3న ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విశ్వ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది. 
 
విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్ హీరోహీరోయిన్లుగా అలీ, ఆమని, భాగ్యరాజా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ ఆర్ క్రియేటివ్ కమర్షియల్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఓ చిత్రం రూపొందుతోంది. చలపతి పువ్వల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కోమలి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్‌. చంద్రమోహన రెడ్డి నిర్మిస్తున్నారు.  ఇదేకాకుండా ప్ర‌ముఖ నిర్మాత‌, న‌టుడు డిఎస్‌.రావ్ నేతృత్వంలో ఓ యూల్‌ఫుల్ ల‌వ్‌స్టోరి రూపొంద‌బోతోంది.
 
webdunia
Viswa Kartikeya photos
బాలకృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ చిత్రాల‌తో కెరీర్‌
చిన్న వయసు లోనే భిన్న మైన పాత్రలు పోషించి బాల నటుడిగా ప్రేక్షకుల ఈలలు, గోలల నడుమ వెండి తెరపై తలుక్కు మన్నాడు విశ్వ కార్తికేయ. ఆరేళ్ల వయసులో తెరంగేట్రం చేసి జానకి వెడ్స్ శ్రీరాంతో పరిణతి చెందిన నటుడుగా ప్రశంశలు అందుకున్నాడు. 'ఆ నలుగురు'తో శభాష్ అనిపించుకొని  నట కిరీటి కి అప్పడాలు ఎలా అమ్మాలో నేర్పి సక్సెస్ అయ్యాడు. మంచు విష్ణు  మొదటి సినిమాలో  మెరిశాడు. గోరింటాకులో రాజశేఖర్ చిన్నపటి పాత్రను అద్భుతం గా పండించి, లేత మనసులులో కళ్యాణి కొడుకుగా పెద్ద మనసుతో మెప్పించాడు. శివ శంకర్ లో బాల మోహన్ బాబుగా,  బాపు గారి దర్శకత్వం లో బాల కృషుడిగా మై మరపించి బాపు గారి మనసులో స్థానం  సంపాదించుకున్నాడు. అధినాయకుడులో చిన్నప్పటి బాలయ్యబాబు గా వెండి తెరపై నటించి బాలయ్య బాబుతో ప్రశంసలు అందుకున్నాడు.
 
ఎనర్జిటిక్ హీరోగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకం పై ఎం సుధాకర్ రెడ్డి గారు నిర్మాతగా, చలపతి పువ్వల దర్శకత్వం లో కళాపోషకులు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు..
హీరోగా తన నటనకు గాను విమర్శకుల నుండి ప్రశంశలు అందుకున్నాడు.
 
దర్శకులు వి. సముద్ర గారి జైసేన చిత్రం లోనూ మెయిన్ లీడ్ గా నటించి తెలుగు, కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. జైసేన, కళాపోషకులు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం తో ప్రేక్షకుల కు మరింత దగ్గర అయ్యాడు. సినీ పెద్దల ప్రశంసలను సైతం అందుకుని ప్రేక్షకులను మెప్పించాడు. త్వ‌ర‌లో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యామి గౌతమ్‌కు చిక్కు.. ఈడీ నోటీసులు.. ఎందుకంటే?