'మాన్‌సూన్ హంగామా'తో మరో సంచలనానికి జియో... జూలై 20న మీకోసం...
జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులు వారి పాత ఫీచర్ ఫోన్‌ను ఎక్సేంజ్ రూపంలో అందించి కేవలం రూ.501కి కొత్త జియోఫోన్‌ను పొందే అవకాశం. నూతన సంపన్నమైన జియో ఫోన్‌లోని యాప్
జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులు వారి పాత ఫీచర్ ఫోన్‌ను ఎక్సేంజ్ రూపంలో అందించి కేవలం రూ.501కి కొత్త జియోఫోన్‌ను పొందే అవకాశం. నూతన సంపన్నమైన జియో ఫోన్‌లోని యాప్ ఎకోసిస్టమ్‌తో విశేషమైన విషయ పరిజ్ఞానం, కొత్త అంశాలు తెలుసుకునే అవకాశం మరియు ఎంటర్‌టైన్మెంట్‌ను తమ చేతివేళ్లతో స్పృశిస్తూ తెలుసుకోవచ్చు. సామాన్య ప్రజానికానికి టెక్నాలజీని చేరువ చేయడం మరియు సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టడం కోసం ఈ కొత్త జియో ఫోన్.
1. మునుపెన్నడూ లేనివిధంగా జియో ఫోన్ ద్వారా అందుబాటు ధరలోనే కనెక్టివిటీ అనేది చేరువ అయింది.
3. భారతదేశంలో నేటికి 500 మిలియన్లకు పైగా ప్రజలు ఇంటర్నెట్ సదుపాయం లేని ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారికి డిజిటల్ జీవనాన్ని ఆస్వాదించే అవకాశాల తలుపులు మూసుకుపోయేందుకు కారణం వారికి అందుబాటు ధరల్లో ఆ ప్రయోజనాలు లేకపోవడమే.
4. జియో మరియు జియోఫోన్ ఆ పరిస్థితిని మార్చుతోంది.
5. 25 మిలియన్ల భారతీయులు ఇప్పటికే జియో ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు మరియు మిలియన్ల కొలది ప్రజలు జియోఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కలదు. మాన్‌సూన్ హంగామాలో భాగంగా ప్రవేశ రుసుమును తగ్గించడం జరిగింది.
6. డాటా ఆధారంగా భారతదేశాన్ని మార్పువైపు నడిపించేందుకు జియో కృషిచేస్తోంది.
మాన్‌సూన్ హంగామా ఆఫర్
7. జియో డిజిటల్ లైఫ్‌ను రాబోయే జియోఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫర్ ద్వారా అనుభూతి చెందేందుకు మిలియన్ల కొద్ది మొబైల్ ఫోన్ వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు.
8. జూలై 20, 2018 సాయంత్రం 5:01 నిమిషానికి ప్రారంభం కానున్న ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు ఏదైనా ఫీచర్ ఫోన్ (ఏ బ్రాండ్‌కు చెందినది అయినా) ఎక్సేంజ్ చేసి కొత్త జియోఫోన్ (ప్రస్తుతం ఉన్న మోడల్)ను కేవలం రూ.501 ప్రారంభం రుసుముతో పొందవచ్చు.
9. డాటా మరియు ఇంటర్నెట్ శక్తిని ఇంత తక్కువ ప్రారంభ ధరతో ప్రతి ఒక్క ఫీచర్ ఫోన్ వినియోగదారుడు పొందడం మునుపెన్నడూ లేదు. కేవలం జియో వల్లే ఇది సాధ్యమవుతోంది.
విస్తృత శ్రేణిలో ఉన్న యాప్ ఎకోసిస్టమ్
10. తన చిత్తశుద్ధికి కట్టుబడి ఉండటం వల్ల జియో ఫోన్ ప్రపంచంలోనే అత్యుత్తమ యాప్‌ల కేంద్రంగా నిలవనుంది.
11. ఇప్పటివరకు కేవలం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న యాప్స్ ఎకోసిస్టమ్‌ను తన నూతన రూపంలో జియో ఫోన్ అందరికీ అందుబాటులోకి తేనుంది.
12. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ యాప్‌లుగా పేరొందిన ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు యూట్యూబ్‌లను కలిగి ఉండటంతో జియోఫోన్ భారతదేశం ఏ విధంగా విద్య, వినోదం, సమాచారం మరియు ఇతర ముఖ్యమైన సేవలను పొందుతుందో పునర్ నిర్వచించనుంది. ఈ యాప్‌లన్నీ జియోఫోన్ వినియోగదారులకు ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ 2018 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
13. విశిష్టమైన 4జీ కనెక్టివిటీ మరియు ప్రత్యేకమైన వాయిస్ కమాండ్ ఫీచర్ ద్వారా జియో ఫోన్ వినియోగదారులు ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు యూట్యూబ్ యాప్స్‌ను మొదటి సారి ఉపయోగించినప్పటికీ సులభంగా మరియు సౌకర్యవంతంగా వాడుకోగలరు. కాల్స్ చేసుకునేందుకు, సందేశాలు పంపించుకునేందుకు మరియు ఇంటర్నెట్లో శోధించేందుకు, మ్యూజిక్ వినేందుకు, వీడియోలు చూసేందుకు మరియు జియోఫోన్‌లో లభించే మొత్తం అప్లికేషన్నింటినీ ఉపయోగించుకునేందుకు వాయిస్ కమాండ్ ఫీచర్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.
14. కొత్త యాప్ ఎకో సిస్టమ్ ద్వారా జియో ఫోన్ లెక్కకుమించిన సాధ్యాలను వినియోగదారులకు అందజేస్తోంది. ఈ ప్రముఖమైన యాప్‌లతో పాటుగా జియో ఫోన్‌లో ఉన్న ఇతర యాప్‌ల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలను తెలుసుకోవచ్చు, విద్య సంబంధమైన అంశాలను సులభంగా పొందవచ్చు, ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చు మరియు ఒకే క్లిక్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ను పొందవచ్చు. ఇవే కాకుండా అందరికీ ఉపయోగపడే మరెన్నో సేవలు కూడా ఇందులో ఉన్నాయి.