Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో బేసిక్ ఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే వాట్సాప్ సదుపాయం

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్.. 4జీ బేసిక్ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోనులో వాట్సాప్ సదుపాయం లేదు. త్వరలోనే 4జీ బేసిక్ ఫోన్‌లో వాట్సాప్ యాప్

Advertiesment
WhatsApp
, గురువారం, 22 మార్చి 2018 (15:29 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్.. 4జీ బేసిక్ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోనులో వాట్సాప్ సదుపాయం లేదు. త్వరలోనే 4జీ బేసిక్ ఫోన్‌లో వాట్సాప్ యాప్ సదుపాయం తీసుకురానున్నట్లు సమాచారం. వాట్సాప్ యాప్‌ను బేసిక్‌ ఫోనులో తీసుకొచ్చేందుకు ఇప్పటికే జియా వాట్సాప్‌తో చర్చలు జరుపుతుందని తెలిసింది. 
 
వాట్సాప్ కేఏఐఓఎస్‌కు సపోర్ట్ చేసే యాప్‌ను రూపొందించే పనిలో ఉన్నట్టు ఆ సంస్థ వ్యవహరాలను విశ్లేషించే వాబీటా ఇన్ఫో పేర్కొంది. వాట్సాప్ కొత్త వెర్షన్‌ను విడుదల చేసే ముందు పరీక్షిస్తుందనే విషయం తెలిసిందే. 
 
ప్రస్తుతం రిలయన్స్ జియో ఫోన్లను సపోర్ట్ చేసే యాప్ కూడా బీటా దశలో ఉందని వాబీటా ఇన్ఫో తెలిపింది. దీనివల్ల వాట్సాప్ కూడా ప్రయోజనమేనని.. జియో బేసిక్ ఫోన్‌లో వాట్సాప్ కలిస్తే తమ సంస్థకు యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వాబీటా ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఇదిలా ఉంటే.. శామ్‌సంగ్ సంస్థ రిలయెన్స్ జియోతో జతకట్టింది. శామ్‌‌సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్ల అమ్మకం కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ద్వారా గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్ ఫోన్లు రిలయన్స్ డిజిటల్‌, జియో వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ వెబ్‌సైట్ ద్వారా శామ్‌సంగ్ ఫోన్లు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో లభిస్తాయని జియో వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#ICAME2018 : ఎస్ఆర్ఎంలో మెకానికల్ ఇంజనీరింగ్‌పై అంతర్జాతీయ సదస్సు