Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పేరు పవన్ కాదు.. నా విశ్వరూపం చూపిస్తా...

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (08:58 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు.. ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను మద్దతివ్వకపోతే చంద్రబాబు రిటైరై ఉండేవారన్నారు. తన మద్దతుతోనే ఆయన సీఎం అయ్యారని మరోమారు గుర్తు చేశారు. 
 
ప్రజాపోరాటయాత్రలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగసభలో మాట్లాడారు. అధికారం కోసం పార్టీలు మారే నాయకులు వద్దని, సమర్థ యువనాయకత్వం రావాలని ఆకాంక్షించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని లూటీ చేయడం, అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనీ, దీన్ని అడ్డుకునేందుకే చంద్రబాబుకు నాడు మద్దతిచ్చానని చెప్పారు.
 
ముఖ్యంగా, ప్రత్తిపాడు మండలం వంతాడలో రూ.3 వేల కోట్ల మైనింగ్‌ దోపిడీ జరిగింది. నేను వంతాడ లేటరైట్‌ గనుల వద్దకు వెళ్లకుండా గ్రావెల్‌పోసి అడ్డంపెట్టారు. అరేయ్‌.. మీకే (మైనింగ్‌ యాజమాన్యం) చెబుతున్నా. ఇంత ప్రజాబలం ఉన్న జనసేన వస్తుంటే అడ్డంపెడతారా.. తాట తీసి కూర్చోబెట్టకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు. మా మీదా మీ బోడి ప్రతాపం. వంతాడ ఆండ్రూ కంపెనీ ఆటలు సాగనివ్వం. జనసేన అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు సీఎం అండగా లేరు. నన్ను కూరలో కరవేపాకులా పడేశారు. నా సహనం, మర్యాద తగ్గిస్తే నా విశ్వరూపం చూపిస్తా. మా అన్నను కాదని టీడీపీకి సపోర్టు చేస్తే.. ఈరోజు చంద్రబాబు వెళ్లి రాహుల్‌ మోకాళ్లకు దండం పెట్టి.. పాదాలకు నమస్కారం పెట్టినట్లుగా ఆయనకు లొంగిపోయి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడితే నాకు బాధ కలుగదా..? ద్రోహం చేసిన వాళ్లకు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఎలా విధిస్తామో.. అలా కాంగ్రెస్ పార్టీకి కనీసం 14 ఏళ్లు రాష్ట్రంలో స్థానం లేదు. ఎవరైనా దారిన పోయే తద్దినాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటారా.. ఒక్క చంద్రబాబు తప్ప అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments