Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్యల వద్ద కూడా పైసా వసూల్.. హెడ్ కానిస్టేబుల్... ఓ ఫోటోగ్రాఫర్...

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (17:57 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వేశ్యల నుంచి ఓ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఓ పాత్రికేయుడు మూమూళ్లు వసూలు చేస్తున్న విషయం బహిర్గతమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శుక్రవారం నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వేశ్య వద్ద డబ్బులు వసూలు చేసి అడ్డంగా దొరికిన ఏపీ ఎస్పీ ఆరో బెటాలియన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కె.వెంకట సురేష్‌ ఉదంతంలోనూ మరోసారి సిబ్బంది, పాత్రికేయుల వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సురేష్‌ ఉదంతంలో లోతైన దర్యాప్తు జరుగుతోంది. అతడిని శనివారం కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించారు. అయితే ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న అధికారులకు అనేక కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం.
 
వెంకట సురేష్‌ భార్య అతడితో విభేదించి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి అతను ఓ వేశ్యతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు. తాను వ్యభిచారం చేసి డబ్బు తెస్తానని చెప్పిన ఆమె నగరాలకు చెందిన ఓ వ్యభిచారిణి వద్దకు వచ్చింది. గతంలోనూ ఆమె ఆ వ్యభిచారిణి వద్ద సెక్స్‌ వర్కర్‌గా పని చేసింది. ఈ నేపథ్యంలో గత నెల 31న వెళ్లినపుడు వారిద్దరి మధ్య గొడవ జరిగి సెక్స్‌వర్కర్‌పై ఆ మహిళ చేయిచేసుకుంది. 
 
దీంతో ఆమె ఈ విషయం కానిస్టేబుల్‌కు చెప్పింది. ఆగ్రహించిన అతడు 31వ తేదీన రాత్రి కారులో ఆమె వద్దకు వెళ్లాడు. వ్యభిచారం చేస్తున్నట్లు ఫిర్యాదు ఉందని, అధికారులు కారులో ఉన్నారని, వారికి రూ.25 వేలు, తనకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

రూ.20 వేలు ఇచ్చిన ఆమె అతడు వెళ్లిన అనంతరం ఇద్దరు వ్యక్తులకు ఫోన్‌ చేసింది. దీంతో వారిద్దరూ రూ.5 వేల కోసం మళ్లీ వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్‌ను సీసీఎస్‌ పోలీసులకు పట్టించారు. ఈ వ్యవహారంలో ఓ చానెల్‌లో పని చేసి మానేసిన కెమెరామెన్ హస్తం ఉన్నట్టు సమాచారం. దీంత అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం