Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ChidambaramMissing ఇంటికెళ్లి చూస్తే ఆయన లేరు.. ఏమైంది?

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (10:39 IST)
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఐఎన్ఎస్ మీడియా అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంకా రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలని మంగళవారం చిదంబరం ఇంటికి సీబీఐ నోటీసులు అతికించింది.


దీనిపై చిదంబరం తరపు లాయర్ ఫైర్ అవుతున్నారు. రెండు గంటల్లో హాజరు కావాలని నోటీసులు అంటించడం సబబు కాదని సీబీఐపై మండిపడుతున్నారు. ఏ చట్టం ప్రకారం తన క్లయింట్‌ను రెండు గంటల్లోగా సీబీఐ ఎదుట హాజరుకావాలన్నారని ప్రశ్నించారు.
 
కాగా  ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐఎన్ఎక్స్‌కు లబ్ది చేకూర్చడం కోసం ''ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు''అవకతకలకు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా చిదంబరం ఉన్నారు. దీంతో ఇందులో ఆయన పాత్ర కూడా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. 
 
మే 15, 2017లో దీనిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఇక ఈ వ్యవహారంపై దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న కారణంతో చిదంబరం కుమారుడిపై కూడా కేసులు నమోదైనాయి. ఐఎన్ఎక్స్‌కు లబ్ది చేకూర్చేందుకు చిదంబరం కొడుకు డబ్బులు డిమాండ్ చేశారని ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణీ ముఖర్జీ గతంలో సీబీఐ విచారణలో వెల్లడించారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో విచారణ కోసం ఢిల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు.. ఇంట్లో ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన మరో టీమ్, ఆయన నివాసానికి నోటీసులు అతికించింది. 
 
రెండు గంటల్లోగా సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసులో ఆదేశాలున్నాయి. అదే సమయంలో ఢిల్లీ హైకోర్టులో చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దయింది. దీంతో చిదంబరం అరెస్ట్ తప్పదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక సుప్రీంకోర్టు కూడా ప్రతికూలంగా స్పందిస్తే.. చిదంబరం జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చిదంబరంపై చర్చలు మొదలయ్యాయి. #ChidambaramMissing అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments