మోడీని కాదు.. అమితాబ్‌ను ఎన్నుకుని ఉండాల్సింది : ప్రియాంకా

శుక్రవారం, 17 మే 2019 (19:54 IST)
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ స్థానంలో బాలీవుట్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ప్రజలు ఎన్నుకుని ఉండాల్సిందని ఏఐసీసీ యూపీ వెస్ట్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సెటైర్లు వేశారు. ఆమె శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్, సలెంపూర్‌లలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు మోడీ అని, ప్రజలు ఆయనకు బదులు అమితాబ్ బచ్చన్‌ను ప్రధానిగా ఎన్నుకుని ఉండాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకంటే, మోడీగానీ, అమితాబ్ బచ్చన్‌గానీ ప్రజలకు సేవ చేసిన దాఖలాలు లేవన్నారు. 
 
అభివృద్ధి అజెండా కంటే, పబ్లిసిటీ, అబద్ధాలతోనే మోడీ లబ్ది పొందాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారణాసి ప్రజలకు మోడీ ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నాయకుడు అనేవాడు ప్రజలకు నిజాలు చెప్పాలని, మోడీ మాత్రం అవాస్తవాలు చెబుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఈసీ పాత్రపై అనుమానాలు... సత్యమే గెలుస్తుంది : రాహుల్ గాంధీ