Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌశల్ బిగ్ బాస్ 2 విజేత ఎలా అయ్యాడు..?

112 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ‘బిగ్ బాస్ సీజన్ 2’ రియాలిటీ షోలో కౌశల్ విజేతగా నిలిచాడు.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (22:45 IST)
112 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ‘బిగ్ బాస్ సీజన్ 2’ రియాలిటీ షోలో కౌశల్ విజేతగా నిలిచాడు. నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవ‌హ‌రించిన సీజ‌న్ 2లో మొత్తం 18 మంది కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. 112 రోజుల పాటు విజ‌య‌వంతంగా త‌మ జ‌ర్నీని కొన‌సాగించిన ఐదుగురు స‌భ్యులు మాత్రమే చివ‌రికి ఫైన‌లిస్ట్‌లో మిగిలారు.
 
గ్రాండ్ ఫైనల్‌కు ఐదుగురు సభ్యలు కౌశల్, గీతా మాధురి, తనీష్, సామ్రాట్, దీప్తిలు వచ్చారు. తనీష్, సామ్రాట్, దీప్తిలు ఎలిమినేట్ అయ్యి గీత, కౌశల్ మాత్రమే ఫైనల్ కాంటెస్ట్‌కి వచ్చినా తుది పోరులో బిగ్‌బాస్ తెలుగు -2 విజేతగా కౌశల్‌ నిలిచాడు. దాదాపు 26 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్‌లకు రాగా, ఇందులో దాదాపు 12 కోట్ల ఓట్లు ఒక్క కౌశల్‌‌కే రావడంతో  టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు కౌశల్.
 
కౌశల్‌ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు. హౌస్‌లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌ల్లో కౌశల్‌ తనదైన ముద్ర వేశాడు. కౌశ‌ల్ ఓ న‌టుడిగా బిగ్‌బాస్‌ హౌస్‌లోనికి అడుగుపెట్టినా అతని  వ్యక్తిత్వం, ముక్కుసూటితనంతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్నాడు కౌశల్. బిగ్ బాస్ విజేతగా కౌశల్ నిలవడంతో అతని అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments