ఆసియా కప్... అబ్బా... వామ్మో అనిపించారుగా... టీమిండియా చంపేసింది...
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూసినవారికి బీపీ వుంటే మాత్రలు మీద మాత్రలు వేసుకోవాల్సిందే. చివరి బంతి వరకూ మహా ఉత్కంఠగా పోరు జరిగింది. లక్ష్యం స్వల్పమైనా బంగ్లాదేశ్ బౌలర్లు టీమిండియా బ్యాట్సమన్లకు చుక్కలు చూపించారు. ఐతే టీమిండియా ఆటగాళ్లు తమ ఆత్మవిశ్వాసం కోల
Publish Date: Sat, 29 Sep 2018 (07:19 IST)
Updated Date: Sat, 29 Sep 2018 (07:23 IST)
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూసినవారికి బీపీ వుంటే మాత్రలు మీద మాత్రలు వేసుకోవాల్సిందే. చివరి బంతి వరకూ మహా ఉత్కంఠగా పోరు జరిగింది. లక్ష్యం స్వల్పమైనా బంగ్లాదేశ్ బౌలర్లు టీమిండియా బ్యాట్సమన్లకు చుక్కలు చూపించారు. ఐతే టీమిండియా ఆటగాళ్లు తమ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చివరి వరకూ పోరాడి గెలిచి శభాష్ అనిపించుకున్నారు.
223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా చివరి బంతి వరకూ చంపేసిందంటే నమ్మండి. గెలుస్తారా లేదా అనే ఉత్కంఠతో భారత్ క్రీడాభిమానులు ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (48), శిఖర్ ధవన్ (15) శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ వాళ్లు ఔట్ కాగానే పరిస్థితి మారిపోయింది. అంబటి రాయుడు కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత వచ్చిన ధోనీ, దినేష్ జాగ్రత్తగా ఆడారు. ఇక ఫర్వాలేదులే... ఇండియా గెలుపుకు ఢోకా వుండదు అనకుంటున్న తరుణంలో ధోనీ ఔట్. జాదవ్ రిటైర్డ్ హర్ట్. ఇక అంతే... భారత్ గెలుపు కష్టమైనట్లు కనిపించింది.
మరోవైపు బంగ్లా బౌలర్లు టీమిండియాపై గట్టి పట్టును ప్రదర్శించారు. ఐతే రవీంద్ర జడేజా (23), భువనేశ్వర్ కుమార్ (21) బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. చివరి బంతికి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా ఆసియా కప్ కైవసం చేసుకుని తమకు తిరుగులేదని నిరూపించుకుంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More