సామ్రాట్, తేజస్విలది ప్రేమ కాదంట.. తేల్చి చెప్పిన గీతా మాధురి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 ఇంకో మూడు రోజులలో ముగియనుంది. ఆదివారం నాడు విజేత ఎవరో ప్రకటించబోతున్నారు.

శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (11:46 IST)
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 ఇంకో మూడు రోజులలో ముగియనుంది. ఆదివారం నాడు విజేత ఎవరో ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఇప్పుడు ఇంట్లో మిగిలిన ఐదుగురు సభ్యుల మొత్తం ప్రయాణాన్ని, తీపి, చేదు జ్ఞాపకాల వీడియోలను ప్రత్యేకంగా ప్రదర్శించి, వారి గురించి చెప్పారు. బిగ్‌బాస్ హౌస్‌లో తమ ప్రయాణాన్ని చూసుకుని హౌస్‌మేట్స్ అంతా భావోద్వేగానికి లోనయ్యారు. ముందుగా దీప్తి వీడియోను చూపించారు. టాస్క్‌ల్లో ఆమె చూపిన పట్టుదల ప్రశంసనీయం, అలాగే ఆమె అందరినీ అమ్మలా చూసుకున్న తీరు అభినందనీయం అని పేర్కొన్నారు. ఇక తన అమాయకత్వంతో అందరినీ అలరించారని ప్రశంసించారు బిగ్ బాస్.
 
ఇక సామ్రాట్‌ వీడియో చూపుతూ.. అందరి అభిమానాన్ని చూరగొన్నారు. కొందరితో బంధాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయంటూ తేజస్వీ, సామ్రాట్‌ల బంధం గురించి చెప్పి వారు కలిసున్న క్షణాలను బిగ్‌బాస్ చూపించారు. తర్వాత ఈ విషయం గురించి సామ్రాట్ చెబుతూ.. ‘‘తేజస్వీతో లవ్ స్టోరీ చూపించాడు’’ అనగానే గీత మధ్యలో వచ్చి ‘‘లవ్ కాదు’’ అని చెప్పింది. దీనిపై సామ్రాట్ స్పందిస్తూ.. ‘‘అంటే బిగ్‌బాస్ లవ్‌స్టోరీలా చూపించాడు’’ అని సర్దుకున్నాడు.
 
తనీష్ గురించైతే ఓ రేంజ్‌లో చెప్పారు బిగ్‌బాస్ ‘‘తనీష్ హౌస్‌లో వచ్చిన మొదట్లో మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనుకున్నారు. కానీ, ప్రేక్షకులకు మీరు చూపిన వాత్సల్యం, సంరక్షణ అన్నీ చాలా బాగా అనిపించాయి. మీకు ఏర్పడిన బంధాలు, మీరు వాటికి ఇచ్చిన విలువ ఇంకెవరూ ఇవ్వలేరేమో, బయట ఎంతో ఈజీగా గొడవలకు దిగే తనీష్ లోపల ఇంత ప్రేమ ఉందా అని బిగ్ బాస్ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కౌశల్‌ను వాటేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న తనీష్... ఏమైంది?