Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఐవీఆర్
శనివారం, 14 జూన్ 2025 (13:24 IST)
పవిత్రమైన దేవాలయాల్లో ఇటీవలి కాలంలో పాడుపనులు చేసేవారు ఎక్కువవుతున్నారు. దేవాలయంలో భక్తిశ్రద్దలతో ఆ భగవంతుడిని దర్శించుకుని వెళ్తుంటారు భక్తులు. కానీ ఈమధ్య కాలంలో దేవాలయాలలో కూడా రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం వెంపర్లాడేవారు ఎక్కువయ్యారు. గుడిలో అలాంటి పనులు చేయకూడదనే ఇంగితజ్ఞానం కూడా వుండటంలేదు.
 
ఇక అసలు విషయానికి వస్తే... గుడిలో జరిగిన ఓ విషయాన్ని వీడియో ద్వారా తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఓ నెటిజన్. ఆ వీడియోలో... ఆలయ ప్రాంగణంలో కొత్తగా పెళ్లయిన భార్య నిలబడి వుండగా ఆమె భర్త హఠాత్తుగా ఆమె కాళ్లపై పడి ఆపై మోకాళ్లపై నిలబడి చేతులు చాస్తూ కనిపించాడు. ఆలయ ప్రాంగణంలో అతడలా యువతి కాళ్లపై పడి నమస్కారాలు పెట్టడం చూసినవారు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఐతే ఓ బామ్మ మాత్రం తన కోపాన్ని ఆపుకోలేకపోయింది.
 
వెంటనే వారినుద్దేశించి... గుడిలో ఇలా చేయడానికి సిగ్గులేదూ. దేవాలయంలో దేవతల కాళ్లపై మాత్రమే పడాలి. ఇక్కడ మనుషులెవరికీ కాళ్లపై పడి దణ్ణాలు పెట్టకూడదు. ఆమాత్రం బుద్ధి కూడా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సదరు కపుల్స్ మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. పళ్లికిలిస్తూ, వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments