Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న 'గే' యువరాజు

Webdunia
సోమవారం, 11 జులై 2022 (07:49 IST)
సాధారణంగా స్త్రీపురుషుల వివాహాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ ఓ గే వివాహం అదేస్థాయిలో నిర్వహించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఆ స్వలింగ సంపర్కుడు ఎవరో కాదు.. గుజరాత్‌కు చెందిన యువరాజు మానవేంద్ర సింగ్ గోహిల్. ఈయన తాజాగా వివాహం చేసుకున్నారు. 2022 జులై 6న అమెరికాలోని కొలంబస్‌లో డీఆండ్రీ రిచర్డ్‌సన్‌ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 
 
ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఆయన తాజాగా షేర్ చేశారు. మానవేంద్ర సింగ్‌, డీఆండ్రీ రిచర్డ్‌సన్‌ గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు వివాహం చేసుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, ఈ విషయం గురించి బహిరంగంగా ప్రకటించారు. తమ వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌చేశారు. 
 
తనను తాను 'గే'గా ప్రకటించుకున్న మానవేంద్ర సింగ్‌.. భారత్‌లోనేకాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు పొందారు. స్వలింగ సంపర్కుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. రాజ్‌పిప్లాలో స్వలింగ సంపర్కుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అమెరికా రచయిత జనేత్‌ పేరును పెట్టారు. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది స్వలింగ సంపర్కుల ఆశ్రమంగా పేరొందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments