Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్లో ఎగరేస్తూ వడా పావ్​ తయారీ.. ముంబైలో చెఫ్ అదుర్స్.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (21:11 IST)
Flying Vada Pav
ముంబైలోని మంగల్​దాస్​ మార్కెట్​లో ఉండే 'శ్రీ బాలాజీ దోశ' సెంటర్​లో గాల్లో ఎగిరే దోశలు బాగా ఫేమస్ అయ్యాయి. ప్రస్తుతం ఇదే తరహాలో ఓ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్​ అవుతోంది. ఇక్కడ దోశ కాకుండా వడను గాల్లో ఎగరేసి వడా పావ్ తయారు చేస్తున్నాడో చెఫ్​. ఇది కూడా ముంబైలోని ఒక స్ట్రీట్​ ఫుడ్​ సెంటర్లోనే చోటుచేసుకోవడం విశేషం. 
 
ముంబై బోరా బజార్​ స్ట్రీట్​లోని 'రఘు దోశా వాలా' అనే ఒక స్ట్రీట్​ ఫుడ్​ స్టాల్​లో వడా పావ్​ చాలా ఫేమస్​. ఇక్కడ రుచికరమైన వడాపావ్​ను కేవలం రూ.40 లకే అందిస్తారు. ఈ ఫుడ్​ స్టాల్​​ను నడిపిస్తున్న 60 ఏళ్ల రఘు అందిరికంటే భిన్నంగా వడా పావ్​ తయారు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు.

గాల్లో ఎగరేస్తూ రఘు వడా పావ్​ తయారు చేస్తున్నాడు. కాగా, అతడు వడాపావ్​ తయారు చేస్తున్న వీడియోను 'ఆమ్చీ ముంబై' అనే ఫుడ్​ వ్లాగర్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్​ అవుతోంది. 
 
గాల్లో ఎగరేస్తూ వడా పావ్​ తయారు చేసే విధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గాల్లోకి ఎగరేస్తూ వడా పావ్ తయారుచేసే విధానం ప్రస్తుతం ముంబైలోనే కాకుండా దేశమంతటా పాపులర్​ అవుతోంది. కాగా, క్షణాల్లో ఈ వీడియో వైరల్​ అవ్వగా నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 
 
ఈ వీడియోను చూసిన ఒక నెటిజన్ ఫ్లయింగ్​ వడా పావ్​​ అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేయగా.. మరొకరు.. ఫైయింగ్​ పానీ పూరి ప్లీజ్​ అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 2.62 లక్షలకు పైగా వ్యూస్​ను సంపాదించిన ఈ వీడియో, దాదాపు 6 నిమిషాల పాటు ఉంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments