Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ రాజకీయాల్లోకి విజయం - ప్రశాంత్ కిషోర్‌తో రహస్య మంతనాలు!

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:45 IST)
కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ మక్కల్ ఇయ్యక్కం పేరుతో ఆయన అభిమానులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆయన జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపినట్టు టాక్ వినిపిస్తుంది. 
 
ఈ సమావేశం హైదరాబాద్‌లో జరిగినట్టు వినికిడి. ఈ భేటీపై ఆయన అనుచరులు కూడా నిజమేనని అంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకేకు ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఒక్క పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అన్నాడీఎంకేను తమిళ ప్రజలు తిరస్కరించారు. 
 
ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన నగర పాలక ఎన్నికల్లో అన్నాడీఎంకేను చిత్తుగా ఓడించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొంది. దీన్ని భర్తీ చేసేందుకు విజయం రాజకీయ పార్టీని స్థాపించాలన్న బలమైన ఆకాంక్షతో ఉన్నారు. పైగా, బీజేపీ బద్ధ వ్యతిరేకంగా విజయ్ ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments