Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అరవింద్ ఆస్తి కొడుకులకు పంచేశారా? గీతా ఆర్ట్స్ పెద్దకొడుక్కి ఇచ్చేశారా? (video)

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (14:52 IST)
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్... అనే పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ బ్యానర్ గుర్తుకు వస్తుంది. ఈ బ్యానర్ పైన ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు అల్లు అరవింద్. వాటిలో మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు కూడా వున్నాయి.

ఐతే ఇటీవలి కాలంలో ఆయన చిత్రాలను నిర్మించడంలో వేగాన్ని కాస్త తగ్గించేశారు. ఏదైనా చిత్రాలు నిర్మిస్తే అల్లు అర్జున్ హీరోగా పెట్టి తీస్తూ వస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... అల్లు అరవింద్ ఈమధ్యనే తన 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
 
70 ఏళ్లు నిండాక కూడా చిత్ర నిర్మాణ బాధ్యతలను నెత్తి మీద వేసుకుని, కథా చర్చలు వగైరాలు చేయడం కాస్త కష్టమని అనుకున్నారో ఏమోగానీ ఆస్తినంతా ముగ్గురు కొడుకులకి పంచేసి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారట. అందువల్ల గీతా ఆర్ట్స్ బ్యానర్ పెద్ద కుమారుడు వెంకటేష్‌కి, మిగిలిన ఆస్తులను కూడా అల్లు అర్జున్, అల్లు శిరీష్ కి పంచేయాలని డిసైడ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఇందులో భాగంగానే తాజాగా అల్లు వెంకటేష్ గీతా ఆర్ట్స్ బ్యానర్ క్రింద వరుణ్ తేజ్ హీరోగా చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రంలో నిర్మాతగా అల్లు అరవింద్ కి బదులు అల్లు వెంకటేష్ అనే పేరు పడబోతోంది. ఇక బన్నీ కూడా ఈమధ్యనే కొత్త ఇల్లు నిర్మాణానాకి శంకుస్థాపన చేశారు. చెర్రీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి విజయవంతంగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా అదే ప్లానుతో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments