చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. కానీ, ఈ చిత్రం విడుదలకు ముందే ఓ వ్యక్తి తిలకించారు. సైరాను తిలకించిన తొలి ప్రేక్షకుడు ఆయనే. ఆయన పేరు అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాత. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు కాకుండా ఈ సినిమా చూసిన మొదటి ప్రేక్షకుణ్ణి నేనే. ఇంత భారీ బడ్జెట్ సినిమా ఎలా ఉంటుందోనన్న భయంతో చూశా. ఒక్కో సీన్ చూసి కింద పడిపోయా. కింద నుంచి లేచి చిరంజీవిని కౌగిలించుకున్నా. అంత అద్భుతంగా సినిమా వచ్చింది అని చెప్పుకొచ్చారు. 
 
									
										
								
																	
	 
	ఆ తర్వాత చిత్ర దర్శకుడు ఏ.సురేందర్ రెడ్డి స్పందిస్తూ, 'ఈ సినిమా కోసం 250 రోజులు చిత్రబృందమంతా ఓ కుటుంబంలా చాలా కష్టపడ్డాం. వాళ్లందరికీ, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చిరంజీవికి, రామ్‌చరణ్‌కి థ్యాంక్స్. చరణ్ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపించారు అని చెప్పారు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ వివి.వినాయక్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమా రారాజు, అన్నయ్య చిరంజీవి ఈ సినిమాలో ఉగ్ర నరసింహస్వామిలా ఉన్నారు' అని అన్నారు.