Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

'డాడీ'కే కాదు తెలుగు ప్రజలందరికీ చెర్రీ ఇస్తున్న గిఫ్టు : రాజమౌళి

Advertiesment
SS Rajamouli
, సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:30 IST)
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం యూనిట్‌ను ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిరుజల్లులే అక్షింతలుగా చేసి ఆశీర్వదించారనీ, ఈ చిత్రం సూపర్ హిట్ కావడం ఖాయమని మా అందరికీ నమ్మకం ఉందని దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి అన్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలోని లాల్‌బహుదూర్ స్టేడియంలో జరిగింది. ఇందులో రాజమౌళి పాల్గొని మాట్లాడుతూ, 'ఇంత పెద్ద సినిమా, చారిత్రాత్మకమైన సినిమా వేడుక జరుగుతుందంటే ముందుగా మనం అభినందించాల్సింది పరుచూరి బ్రదర్స్‌నే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎన్ని సంవత్సరాలుగా వారి గుండెల్లో మోశారో సినిమా ఫీల్డ్‌లో ఉన్న అందరికీ తెలుసు. బ్రిటీష్ మీద మొట్టమొదట పోరాడింది ఒక తెలుగు వీరుడని అందరికీ తెలియాలని చాలా సంవత్సరాలు వారు వేచి చూశారు. 
 
ఇన్ని సంవత్సరాలకి ఆ కోరికను మా హీరో రామ్ చరణ్ తీరుస్తున్నాడు. చరణ్ ఇది వాళ్ల నాన్నగారికి ఇస్తున్న గిఫ్ట్ మాత్రమే కాదు. మొత్తం తెలుగువాళ్లందరికీ ఇస్తున్న గిఫ్ట్. ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. మా 'బాహుబలి'కి పనిచేసిన విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ కమలకన్నన్ ఈ సినిమా గురించి నాకు మెసేజ్ చేశారు. 'బాహుబలి'లో 2300 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటే, "సైరా"లో 3800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని. 
 
విఎఫ్ఎక్స్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ, అన్ని వందల, వేల షాట్స్ మధ్యలో ఎమోషన్ వదలకుండా, మరిచిపోకుండా చేయడం గొప్ప విషయం. ఎందుకంటే సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేసేది ఎమోషన్స్ కాబట్టి.. వాటిన్నింటిని సెట్ చేయాల్సిన బాధ్యత దర్శకుడిపై ఉంటుంది. ఈ జాబ్‌ని అద్భుతంగా నిర్వహించిన దర్శకుడు సురేందర్ రెడ్డికి అభినందనలు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా మీద అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ క్రెడిట్ అంతా సురేందర్ రెడ్డికే చెందుతుంది. 
 
చిరంజీవితో నేను ఒక చిన్న సీన్‌ను మాత్రమే డైరెక్ట్ చేశాను. 'మగధీర' సినిమా టైమ్‌లో స్టోరీ సిట్టింగ్స్‌లో చిరంజీవితో పాటు కలిసి కూర్చున్నాం. ఎన్నో సలహాలు ఇచ్చారు. కొన్ని సీన్స్ అయితే యాక్ట్ చేసి చూపించారు. అప్పుడు నాకొక డౌట్ వచ్చింది. 'మగధీర' సినిమాకు హీరోగా రామ్ చరణ్‌ని ఊహించుకోవడం లేదు. ఆయనే హీరో అనుకుంటున్నాడనే డౌట్ వచ్చింది. 
 
ఇదే విషయం నా భార్యతో కూడా చెప్పాను. 'మగధీర' సినిమా రిలీజ్ అయిన తర్వాత.. 'రాజమౌళీ.. ఇలాంటి సినిమా నేను ఒక్కటి కూడా చేయలేదు' అని చెప్పారు. ఆ కోరికను ఇప్పుడు చరణ్ తీరుస్తున్నాడు. ఇక్కడ కురిసింది వర్షం కాదు.. పై నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేసిన అక్షింతలు, శుభాశీస్సులు" అని రాజమౌళి చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి ఇంట్లో మా అన్నలాంటి వారు ఉంటే ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోరు : పవన్