Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం, దేవా నాతో ఆడుకోకు అంటూ శ్రావణి ఆడియో

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:05 IST)
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయట పడింది. సాయి అనే వ్యక్తి శ్రావణిని నా ముందే చంపాలని చూశాడని, తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాడు అని దేవరాజు వీడియో ఒకటి విడుదల చేశాడు. సాయిని పెళ్లి చేసుకోక పోతే చంపేస్తాడని భయంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది అని దేవరాజ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
 
శ్రావణి కాల్ రికార్డ్ మొత్తం పోలీసులు ముందు పెడుతానని, తల్లిదండ్రులు ఒత్తిడితోనే గతంతో శ్రావణి తనపై కేసు పెట్టిందన్నాడు దేవరాజు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోమని శ్రావణి తనను అడిగిందని, తను ఒప్పుకోకపోయేసరిగా నాపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు దేవరాజు.
రెండు రోజులు క్రితం శ్రావణి తోకలిసి తను శ్రీకన్య రెస్టారెంట్‌కి వెళ్లడం జరిగిందని, హోటల్ సమీపంలో శ్రావణిని కత్తితో పొడిచేందుకు సాయి ప్రయత్నం చేశాడన్నాడు దేవరాజ్. శ్రావణికి సాయి అనే వ్యక్తి 5 సంవత్సరాల నుండి పరిచయం ఉందని, సంవత్సరం క్రితం నేను శ్రావణికి పరిచయం అయ్యానని చెప్పాడు. శ్రావణి కుటుంబ సభ్యులు మరియు సాయి అనే వ్యక్తి ఆమెను కొట్టి హింసించేవారని నాతో చెప్పిందని దేవరాజ్ చెబుతున్నాడు.
అయితే శ్రావణిని, దేవరాజ్ బెదిరించిన ఆడియో ఇప్పుడు కీలకంగా మారింది. మర్యాదగా వచ్చి తనతో గంట టైం గడపాలని, రాకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవు అంటూ ఆ ఫోన్ కాల్‌లో దేవరాజ్ బెదిరింపులకు దిగాడు. శ్రావణి మాత్రం ఇంతటితో ఆపేయ్ దేవ, నీకు విశ్వాసం లేదు దేవ, నాతో ఆడుకోకు దేవ, నీతో మాట్లాడను సారీ దేవా అంటూ శ్రావణి ఫోన్ పెట్టేసింది. ఈ ఆడియో ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారునుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments