Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ దేవరకొండతో మళ్లీ గీత గోవిందం హీరోయిన్..?

Advertiesment
Vijaya Devarakonda
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన జత కట్టనుంది. తాజాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. 
 
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత 'గీతగోవిందం' అనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు విజయ్. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది.
 
ఇదే హీరోయిన్‌తో 'డియర్ కామ్రేడ్' అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా మరో సారి రష్మికతో కలిసి నటించనున్నాడనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. అయితే అది సినిమా కోసం కాదట. ఒక యాడ్ కోసం ఈ ఇద్దరు మరోసారి కలిసి నటించనున్నారని తెలుస్తోంది.
 
ప్రముఖ వస్త్ర కంపెనీకి సంబంధించిన యాడ్‌లో ఈ ఇద్దరు నటించబోతున్నారని సమాచారం. అయితే ఈ బ్రాండ్‌కి ఈ బ్యూటీని విజయ దేవరకొండనే సిఫార్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళ్‌లో 'సుల్తాన్'.. కన్నడలో 'పొగరు' చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరపై వర్మ జీవితం.. మూడు భాగాలుగా రానున్న మూవీ.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?