Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకును నడుపుతూ.. ప్రేయసిని ముందు కూర్చోబెట్టుకుని ముద్దు ముచ్చట.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 6 మే 2019 (16:34 IST)
ప్రేమికులు ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ కానిచ్చేస్తున్నారు. సినిమా థియేటర్లు, బీచ్‌లు, పార్కుల్లో గంటల పాటు మాట్లాడుకోవడాలే కాకుండా రొమాన్స్ కానిచ్చేస్తున్నారు.


తాజాగా ఓ ప్రేమ జంట నడుస్తున్న బైకులో ఓవరాక్షన్ చేసింది. ఓ యువకుడు బైకును నడుపుతూ తనకు ముందు తన ప్రేయసిని కూర్చోబెట్టుకున్నాడు.. ప్రేయసి ముద్దులిస్తుంటే.. హ్యాపీగా రొమాన్స్ చేస్తూ బండిని నడిపాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
సినీ ఫక్కీల్లో హీరోలు తన ప్రేయసిని బైకుకు ముందుకు కూర్చోబెట్టుకుని నడిపేలా ఆ యువకుడు కూడా చేశాడు. ఈ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ రోడ్లు ఎప్పుడూ రద్దీగా వుంటాయి. అలాంటి రోడ్డుపై ప్రేయసిని ముందు తనవైపు చూసేలా కూర్చోబెట్టుకున్న యువకుడు బైకును నడిపాడు. తన ప్రేయసికి ఆ ప్రేమికుడు ముద్దులిస్తున్నాడు.
 
ఆమె అతనిని కౌగిలించుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అుతోంది. అలా అభ్యంతరకరంగా నడి రోడ్డుపై ఆ ప్రేమ జంట చేసిన చేష్టలకు నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేగాకుండా బైకును నడుపుతూ.. ఢిల్లీ రోడ్డుపై ఇలాంటి వ్యవహారాలు ప్రాణాల మీదకు వస్తాయని ఫైర్ అవుతున్నారు. ఈ ప్రేమ జంటకు ఢిల్లీ పోలీసులు తగిన శిక్ష ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కూడా ఈ వీడియోను తన ట్విట్టర్ పేజీలో నెటిజన్లు పోస్టు చేయడంతో సదరు ప్రేమ జంటపై ఫైర్ అయ్యారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వీడియో ఆధారంగా ప్రేమికులను పోలీసులు గాలిస్తున్నారు. వీరిపై రవాణా చట్టం ప్రకారం 279 సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఆ ప్రేమ జంటకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000ల జరిమానా విధించవచ్చునని సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments