ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలోకి చిరంజీవి?

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక టీడీపీ నేతలు ఆ పార్టీలో చేరారు. వీరిలో ప్రధానంగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు మొదటివరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన సామాజికవర్గమైన కాపు ఓట్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఆ వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని తమతో చేతులు కలిపేలా పాచికలు వీచారు.
 
ఇవి సక్సెస్ కావడంతో చిరంజీవి కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి.. త్వరలోనే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఆయనతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. 
 
చిరంజీవికి కమలనాథులకు మధ్య వారధిగా బీజేపీ నేత రాంమాధవ్ వ్యవహరిస్తున్నారు. తన 151వ చిత్రం ‘సైరా’ విడుదల తర్వాత చిరంజీవి బీజేపీలో ఆయన చేరే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా, ఈ నెల 18న హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నాంపల్లిలో నిర్వహించే ఈ సభ ద్వారా టీ-టీడీపీ నేతలు పలువురు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

Charan: రామ్ చరణ్ క్షేమం - రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు- 27న గేమ్ గ్లింప్స్

యూత్ మూవీ తమిళంలో లాగే తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది - శ్రీ విష్ణు

చెన్నై లవ్ స్టోరీ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్

కోట‌లోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? ఆసక్తిగా రాకాస ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments