Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌తో వ్యభిచారం.. రాకేష్ రెడ్డి లీలలెన్నో...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (09:33 IST)
ఎన్నారై జయరామ్ హత్య కేసులో ప్రధాననిందితుడైన రాకేష్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భూదందాలు, ఎమ్మెల్యేల పేరుతో పరిశ్రమలు, వ్యాపారాల యజమానులకు బెదిరింపులు, వీవీఐపీలతో పరిచయాలు, హైటెక్ వ్యభిచారం.. రాకేష్ చౌదరి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఇతని గత చరిత్రను పరిశీలిస్తే, ఇంటర్మీడియట్‌ వరకూ చదివిన రాకేశ్‌.. జీడిమెట్ల సబ్‌స్టేషన్‌ వద్ద వినాయకుడిని పెట్టి హంగామా చేసేవాడు. టీడీపీలో చేరి యూత్‌ లీడర్‌గా కొనసాగాడు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఒక రాజకీయ నాయకుడిని 2009లో బెదిరించి రూ.20 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఒక కాంగ్రెస్‌ నాయకురాలి కుమారుడికి దగ్గరై పోలీసులతోనూ పరిచయాలు పెంచుకున్నాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, మాదాపూర్‌ ప్రాంతాలు అతడి కార్యస్థావరాలు. 
 
ముఖ్యంగా, రాజకీయ నేతలు, పోలీసులతో పరిచయాలు పెంచుకుని  పారిశ్రామికవేత్తలు, వీఐపీలకు అమ్మాయిలను ఎరవేయడం, ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బులు గుంజడం ఇతడి నేరశైలిగా మారింది. ఆ డబ్బుతో గోవాలాంటి ప్రదేశాలకు వెళ్లి జూదం ఆడుతూ, అమ్మాయిలతో తిరిగేవాడు. అలాగే.. తానొక  ఎమ్మెల్యే కొడుకునని చెప్పుకొంటూ రాకేశ్‌ రెడ్డి ఒక ప్రముఖ హీరోయిన్‌ను వ్యభిచార ఊబిలోకి దింపాడు. 
 
ఓ సినీనటితో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కాగా.. కొన్నాళ్ల క్రితం ఒక పబ్‌లో శిఖాచౌదరికి రాకేశ్‌తో పరిచయమైంది. ఆమే అతణ్ని జయరామ్‌కు పరిచయం చేసినట్లు సమాచారం. జీడిమెట్ల షాపూర్‌నగర్‌లోని హెచ్‌ఎంటీ సొసైటీకి చెందిన కాంగ్రెస్‌ యువనేత ఒకరితో కలిసి జయరామ్‌ను చంపేందుకు నెలరోజుల క్రితమే రాకేశ్‌ రెడ్డి కుట్ర పన్నాడని.. వారి ప్రణాళిక ఫలించలేదని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments