Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ కార్డులకు కొత్త నిబంధన తీసుకొచ్చిన సీబీడీటీ

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:03 IST)
పాన్ కార్డుకు కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా లేదా డిపాజిట్ చేసినా పాన్ లేదా ఆధార్ నంబరు తప్పనిసరిగా వెల్లడించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయపన్ను నిబంధనలు 1962లో పలు సవరణలు తీసుకొచ్చింది. 
 
సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్ డ్రాయల్స్‌కు కూడా ఈ నిబంధనను వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. కాగా, రోజువారీ బ్యాంకు లావాదేవీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డు నంబరు వెల్లడించాలన్న నిబంధన ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల మేరకు 18 రకాల లావాదేవీలకు పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సివుంది. వాహనాలు కొనుగోలు లేదా అమ్మకం, బ్యాంకు ఖాతాఓపెన్ చేయడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయడం, హోటల్ లేదా రెస్టారెంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం, రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో మ్యాచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేయడం వంటి పలు సందర్భాల్లో విధిగా పాన్ నంబరును  సమర్పించాలన్న నిబంధన ఉంది. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments