ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఈ నెల 29వ తేదీన ప్రారంభమై డిసెంబరు 23వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అలాగే, మొత్తం 26 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది.
క్రిప్టో కరెన్సీపై ప్రవేశ పెట్టే బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అన్ని క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే, క్రిప్టో కరెన్సీని ఆదరిస్తున్న దశాల్లో భారత్ కూడా మూడు స్థానాల్లో నిలుస్తుంది. భారత్‌లో సుమార్ పది కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం.