పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం దీప కాంతులతో ప్రకాశించింది. తలుపులమ్మ దేవస్థానంలో పంచలోహాల విగ్రహాల మండపం వద్ద దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలవిరాట్టుకు వేద పండితులు వేదోక్తంగా పూజలు నిర్వహించి, అమ్మవారికి ప్రీతి పాత్రులయ్యారు. అనంతరం ఓం, స్వస్తిక్ ,పద్మం, శివలింగాకారం, రూపాల్లో భక్తులు జ్యోతులను ప్రజ్వలన చేశారు.
శివలింగాకారం జ్యోతులను ప్రజ్వలింపజేసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని సాక్షాత్కరించారు. ఈ దీపోత్సవ కార్యక్రమం లో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి అమ్మవారి పట్ల తమ భక్త ప్రవక్తలను చాటుకున్నారు. ఈ దీపోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. అమ్మవారిని భక్తులు కనులారా దర్శించుకుని తన్మయులయ్యారు. అనంతరం దూప దీప నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.