Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"జెంటిల్మాన్-2" హీరోయిన్‌గా నయనతార!

Advertiesment
, బుధవారం, 23 మార్చి 2022 (20:34 IST)
ప్రముఖ నిర్మాత కేటీ కుంజుమోన్ నిర్మిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం "జెంటిల్మాన్-2". ఈ చిత్రంలో నటించే హీరోయిన్ పేరును ఆయన బుధవారం ప్రకటించారు. నయతార చక్రవర్తి అనే అమ్మాయి ఈ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా పరిచయంకానుంది. 
 
గత 1993లో విడుదలైన ఈ మూవీని నిర్మాత కేటీ కుంజుమోన్ తెరకెక్కించారు. శంకర్ దర్శకత్వం వహించారు. సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్ మూవీగా ఉంది. ఇపుడు సీక్వెల్ మూవీగా తెరకెక్కుతుంది. 
 
ఈ పాన్ ఇండియా మూవీలో మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు అధికారికంగా వెల్లడించారు. ఈమెను మాలీవుడ్‌లో బేబీ నయనతారగా పిలుస్తారు. కాగా, ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా సీక్రెట్‌గా ఉంచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ట్రిబుల్ "ఆర్"