నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈయనపై దేశంలో పలు భాషల్లో కథలుగా పుస్తకాలుగా వచ్చాయి.
తెలుగులో శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి `నేతాజీ గ్రంథ సమీక్ష`రచించారు. ఇందులో ఆయన సైన్యాన్ని ప్రారంభించడం నుంచి దేశంకోసం ఏవిధంగా పోరాడాడు. వివిద దేశాల అధ్యక్షులను ఎలా కలిశాడు వంటివి తెలియజేస్తున్నారు. ఈ గ్రంథ సమీక్ష ఆవిష్కరణను లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నిర్వహిస్తోంది. దీనిని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు. 24వ తేదీ గురువారం సాయంత్రం 6 గం.కు శిల్పకళా వేదిక, మాదాపూర్ నందు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ పుస్తకంపై దేశంలోని పరిస్థితులపై మాట్లాడనున్నారు.