పాకిస్థాన్ చేతిలో అభినందన్.. తమిళనాడుకు చెందిన పైలట్ అట.. ఏం చేస్తారో?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (18:10 IST)
పాకిస్థాన్ విమానాన్ని షూట్ చేసి కూల్చిన భారత వైమానిక దళానికి చెందిన పైలట్ అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా మంగళవారం భారత వైమానిక దళం.. పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి.. జైషే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 300 మంది ఉగ్రమూకలను హత్య చేశారు. 
 
ఇందుకు ప్రతీకారంగా మూడు పాకిస్థాన్ విమానాలు భారత భూభాగంలోకి బుధవారం చొరబడి.. బాంబును జారవిడిచాయి. ఈ క్రమంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ విమానాల్లో ఒకటిని నేలకూల్చింది. మిగిలిన రెండు విమానాలు తప్పించుకుని పారిపోయాయి. ఈ సమయంలో భారత్‌కు చెందిన వైమానిక దళ పైలట్ అభినందన్ అదృశ్యమైనట్లు తెలుస్తోంది. 
 
అభినందన్ పాకిస్థాన్ చేతికి చిక్కాడని వార్తలు వచ్చాయి. కానీ పాక్ సైన్యం చేతిలో అభినందన్ చిక్కుకున్నట్లు వీడియోలు మీడియాలో కనిపించాయి. అరవింద్‌ను తీవ్రంగా కొట్టడం, కళ్లకు కట్టి అతనిని హింసించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
ఈ నేపథ్యంలో అభినందన్ తమిళనాడుకు చెందిన పైలట్ అని చెన్నై మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీడియోలో వున్న పైలట్ తమ బిడ్డేనని.. ఆయన సురక్షితంగా పాక్ నుంచి ఇంటికి చేరుకోవాలని అభినందన్ బంధువు ఒకరు మీడియాతో మాట్లాడారు. కానీ అభినందన్ వ్యవహారంపై.. ఇటు తమిళనాడు సర్కారు నుంచి అటు అభినందన్ కుటుంబీకుల తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments