Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నమ్మ వచ్చేస్తుందా? ఏకం కానున్న పన్నీర్...పళని..

Advertiesment
చిన్నమ్మ వచ్చేస్తుందా? ఏకం కానున్న పన్నీర్...పళని..
, శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:09 IST)
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తన పంతం నెగ్గించుకుంటున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జ్యూడీషియల్ విచారణకు.. ఇప్పటికే అన్నాడీఎంకే సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి పళనిసామి సర్కారు ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా తమిళనాడులో శశికళ వర్గానికి వ్యతిరేకంగా సీఎం పళనిసామి.. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఒక్కటయ్యేందుకు మరో ముందడుగు పడింది. 
 
ఇక పరప్పన జైలులో అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలో విడుదలయ్యే అవకాశం వుండటంతో పళని, పన్నీర్ ఇద్దరూ ఏకమై అమ్మ మృతిపై మరింత లోతుగా విచారణ జరపేందుకే జ్యుడీషియల్ విచారణకు రంగం సిద్ధం చేశారని టాక్ వస్తోంది. అలాగే పొయెస్‌ గార్డెన్స్‌లోని వేద నిలయాన్ని జయలలిత స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 
 
వేద నిలయం ప్రస్తుతం శశికళ ఆధీనంలోనే ఉన్నందున ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పళినిస్వామి పన్నీర్ సెల్వంతో కలిసి శశికళ, దినకరన్‌కు చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యారు. తద్వారా చిన్నమ్మ వచ్చినా.. పార్టీలో ఆమె ప్రమేయం లేకుండా చేేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది.. అందుకే జ్యోతిని చంపేశా...!