Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్ విమానం నుంచి ఖతార్‌కు శరీర భాగాలు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (13:07 IST)
కాబూల్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికదళ కార్గో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడిన విషయం తెలిసిందే. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు.. పరుగులు తీస్తున్న విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు. టర్మాక్‌పై కూర్చుకున్న కొందరు విమానం గాల్లోకి ఎగిరన తర్వాత కింద పడ్డారు. ఆ దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి.
 
అయితే సీ-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానంపై ఎక్కిన కొందరు దాన్ని వీల్ భాగంలో దాక్కున్నారు. సుమారు 600 మందితో వెళ్లిన ఆ విమానం ఖతార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. కానీ ఆ విమానం అక్కడ దిగిన తర్వాత వైమానిక దళ సభ్యులకు మరో షాక్ తగిలింది. విమాన చక్రం (వీల్) భాగంలో మానవ శరీరభాగాలు, అవయవాలు కనిపించినట్లు వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది.
 
సరుకులతో వచ్చిన తమ విమానం కాబూల్‌లో ల్యాండైన కొన్ని క్షణాల్లోనే వందలాది మంది వచ్చి ఎలా దాన్ని ఆక్రమించారో తెలియదని అమెరికా తన ప్రకటనలో పేర్కొన్నది. గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానం సరుకును దించకముందే.. ఆ విమానాన్ని వందలాది మంది చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు.
 
అయితే పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు తేలడంతో.. తక్షణమే సీ-17 విమానాన్ని అక్కడ నుంచి తరలించినట్లు ఆ ప్రకటనలో చెప్పారు. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు అమెరికా వైమానిక దళం చెప్పింది. విమానాశ్రయం వద్ద ఏర్పడ్డ గందరగోళంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎంతమంది మృతిచెందారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments