చైనాలో మనిషికి సోకిన మరో కొత్త వైరస్, ఆందోళనలో ప్రపంచం

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (16:24 IST)
సాధారణంగా బర్డ్‌ఫ్లూ వ్యాధి కోళ్ళకు సోకుతుంది. ఈ వైరస్ సోకి అనేక లక్షల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఆ సమయంలో చికెన్ అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోనే తొలిసారి బర్డ్‌ఫ్లూ తొలిసారి మనిషికి సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్‌ ఫ్లూ మనుషులకు కూడా సోకడం ఇపుడు వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. 
 
ఈ సంఘటన కూడా చైనాలో వెలుగులోకి వచ్చింది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్య‌క్తికి బర్డ్‌ ఫ్లూ సోకిందని ఆ దేశ‌ జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం ఉద‌యం ప్ర‌క‌టించింది.
 
వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) విభాగం వారం రోజుల క్రితం అత‌డికి రక్త పరీక్షలు చేయగా బర్డ్‌ ఫ్లూ సోకిన‌ట్లు నిర్ధారణ అయ్యిందని వివ‌రించింది. అత‌డిలో హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ వ్యాపించిందని ప్ర‌క‌ట‌న రావ‌డంతో చైనా వైద్యారోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది.
 
బాధితుడికి వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అత‌డు ఇటీవ‌ల ఎవరెవరిని కలిశాడ‌నే విష‌యంపై ఆరా తీస్తున్నారు. ఇప్ప‌టికే గుర్తించిన‌ వారంద‌రినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments